వైరా మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా

వైరా మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా

వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా మేడూరి రామచంద్ర రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామం వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబానికి చెందిన రామచంద్ర రావు కూసుమంచి ఎంపీఓగా,ఎంపీడీవో గా ఐదేళ్లపాటు పనిచేశారు. మూడుసార్లు ఎంపీఓగా ఉత్తమ సేవలు అందించినందుకు గాను కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా, అదేవిధంగా ఎంపీడీవో గా ఒకసారి కలెక్టర్ ముజ్మీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రెండు నెలల పాటు సొంత మండలం నూతనంగా మున్సిపాలిటీ ఏర్పడ్డ కల్లూరు మున్సిపాలిటీ కమిషనర్ గా విధులు నిర్వహించారు.

వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన వారందరికీ అందించి అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తానని కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మేడూరి రామచంద్రరావు తెలిపారు. ఆయన ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తానని… అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణం పారిశుద్ధ్య కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు… రానున్న వర్షాకాలంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన పారిశుధ్య చర్యలు చేపట్టనునట్లు అయన తెలిపారు.

Leave a Reply