మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళులు

మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళులు

పాయకాపురం, ఆంధ్రప్రభ : స్వతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చైర్మన్, టి ఎన్ టి సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయం అని వారి పోరాట ప్రతిభను స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యత కోసం అందరూ పాటుపడాలని కోరారు.

గిరిజనులకు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను ఆదర్శంగా తీసుకొని అందరూ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర కోశాధికారి ఆకుల సూర్య ప్రకాష్, దాసరి కనక రావు, బూదల సురేష్, బ్రహ్మరాజు, వెంకటేశ్వరరావు, లక్కి శెట్టి సాయి, సుధీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply