Naveen Yadav | 26న ప్రమాణ స్వీకారం..
Naveen Yadav | 26న ప్రమాణ స్వీకారం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ నెల 26న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తమ ఛాంబర్‌లోనే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, పలువురు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా పార్టీ కీలక నాయకులు హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
