Suriya | ప్లాపులకు బ్రేక్ పడేనా..?

Suriya | ప్లాపులకు బ్రేక్ పడేనా..?

Suriya | సూర్య ప్లాపులకు బ్రేక్ పడేనా..?
తమిళ టైటిల్స్ వల్ల థియేటర్లకు తగ్గుతున్న ప్రేక్షకులు
కరుప్పు సినిమాతో సూర్య కొత్త ప్లాన్
సూర్య డ్యూయల్ రోల్ ప్రత్యేకత
వీరభద్రుడుగా తెలుగులో రిలీజ్ నిర్ణయం
సూర్యకు ఈ సినిమా ఎందుకు కీలకం
విశ్వనాథన్ అండ్ సన్స్‌పై పెరుగుతున్న అంచనాలు

Suriya | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళ్, మలయాళంలో రూపొందిన సినిమాలు.. అవే టైటిల్స్ లో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఇలా రిలీజ్ చేయడం వలన.. ఆ టైటిల్ ఏంటో.. దాని అర్థం ఏంటో ప్రేక్షకులకు తెలియక.. సినిమా థియేటర్స్ కి వెళ్లడం లేదు. తెలుగులో టైటిల్ (Tittile) పెడితే.. కాస్త అర్ధమౌతుంది. థియేటర్ కి వెళ్లి చూడాలి అనిపిస్తుంది. అయితే.. సూర్య కరుప్పు అనే సినిమాలో నటించాడు. మే 14న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో సూర్య తెలివైన నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. సూర్య ఏం చేసాడు..?

Suriya | సూర్య డ్యూయల్ రోల్..

ఈమధ్య కాలంలో.. తంగలాన్, వలిమై, వెట్టయాన్, మార్గన్, రాయన్, తలైవి, పల్లిచట్టంబి అంటూ ఏ భాషలో సినిమా తీసారో అదే భాషలో పెట్టిన టైటిల్స్ తో తెలుగులో రిలీజ్ (Release) చేస్తున్నారు. ఇలా రిలీజ్ చేయడం థియేటర్స్ కి జనాలు రాక బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్నాయి. అయితే.. ఇప్పుడు సూర్య కూడా కరుప్పు అంటూ వస్తే.. ఇదే పరిస్థితి వస్తుందని అభిమానులు ఫీలయ్యారు. ఈ విషయం సూర్య గుర్తించినట్టున్నారు. కరుప్పు టైటిల్ ను తెలుగులో వీరభద్రుడుగా పెట్టారు. ఈ సినిమాకి ఆర్జె బాలాజీ డైరెక్టర్. ఇదోక డివోషనల్ యాక్షన్ డ్రామా. ఇందులో సూర్య డ్యూయల్ రోల్ చేయడం విశేషం.

Suriya

Suriya | వీరభద్రుడుగా సూర్య..

సూర్య నటించిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు రిలీజ్ కాలేదు. చాలా సార్లు వాయిదాపడింది. దీంతో సూర్య అభిమానులే కాదు.. బయ్యర్లకు కూడా విసుగువచ్చిందని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమాకి మోక్షం కలిగింది. తెలుగు ఆడియన్స్ (Audience) కి కనెక్ట్ అయ్యేలా వీరభద్రుడు అనే టైటిల్ పెట్టారు. ఇది సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు. వీరభద్రుడు సినిమా సక్సెస్ అవ్వడం.. సూర్యకు చాలా అవసరం. ఇటీవల కాలంలో సూర్య నుంచి వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే.. నెక్ట్స్ వచ్చే విశ్వనాథన్ అండ్ సన్స్ కు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. మరి.. ఈ రెండు సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించి సూర్య ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Suriya

Leave a Reply