Mamitha baiju | ప్లాన్ ఫలించేనా…?

Mamitha baiju | ప్లాన్ ఫలించేనా…?
Mamitha baiju | కోలీవుడ్ లో దూసుకెళుతున్న మమిత బైజు
వరుస ఆఫర్స్ తో టాప్ ప్లేస్ వైపు అడుగులు
విశ్వనాథన్ అండ్ సన్స్ తో టాలీవుడ్ లో బ్రేక్ వస్తుందా?
ప్రేమలు తర్వాత మమిత కెరీర్ టర్నింగ్ పాయింట్
సూర్య, ధనుష్ సినిమాలతో క్రేజ్ పెరుగుతోందా?
Mamitha baiju | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మమిత బైజు.. ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మలయాళంతో పాటు.. తెలుగులో కూడా సక్సెస్ సాధించడంతో.. అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో దూసుకెళ్లడం ఖాయమనే టాక్ (Talk) వినిపించింది. అయితే.. అ అమ్మ దృష్టి అంతా వేరే చోట ఉంది. ఇంతకీ.. మమిత ఫోకస్ ఎక్కడ పెట్టింది..? టాలీవుడ్ లో మమిత పరిస్థితి ఏంటి..?

Mamitha baiju | కోలీవుడ్ లో దూసుకెళుతున్న మమిత..
మమిత బైజు పుట్టింది.. పెరిగింది అంతా కేరళలోనే. ఆమె మలయాళ సినిమాలతోనే మొదటి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమలు సినిమా సౌత్ లో మమితకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ దృష్టి అంతా కోలీవుడ్ పై పెట్టింది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథ్ (Pradeep Ranganath) సరసన డ్యూడ్ సినిమాలో నటించింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ధనుష్ లతో నటిస్తుంది. ధనుష్ సరసన కారా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక సూర్యకు జంటగా నటించిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం విశ్వనాధ్ అండ్ సన్స్ జులైలో రిలీజ్ కి రెడీ అవుతుంది.

Mamitha baiju | టాప్ ప్లేస్ లో మమిత..
కోలీవుడ్ లో మమితకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. తమిళ నటుడు సూరి కొత్త సినిమాలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. అక్కడ ఆమె చేస్తున్న సినిమాలను చూస్తుంటే.. కోలీవుడ్ లో టాప్ కి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మలయాళంలో చాలా సినిమాలు (Movies) చేసింది. ఇప్పుడు తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఆమె వయసు 24 సంవత్సరాలే. అందుచేత రానున్న రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించి కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ జనాల్లో టాక్ వినిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Mamitha baiju | విశ్వనాథన్ అండ్ సన్స్ తో దశ తిరిగేనా..?
ప్రేమలు సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేశారు. ఇక్కడ కూడా అమ్మడికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే.. ఆశించినట్టుగా ఆఫర్స్ టాలీవుడ్ (Tollywood) నుంచి రాలేదేమో అమ్మడు ఇక్కడ ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు తెలుగులో సూర్య చేసిన స్ట్రైయిట్ మూవీ విశ్వనాథన్ అండ్ సన్స్ లో మమిత నటించింది. ఈ మూవీ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయన వరుసగా సక్సెస్ సాధిస్తున్నారు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే టాక్ ఉంది. అదే జరిగితే.. మమిత తెలుగులో కూడా బిజీ అవుతుందేమో చూడాలి.

