SupremeCourt | నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కీలక ఆదేశాలు

SupremeCourt | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన తప్పిదాల నుంచి ఎన్‌టీఏ గుణపాఠాలు నేర్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.

2024 నీట్ పేపర్ లీక్ ఘటన తర్వాత ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ సూచించిన మార్గదర్శకాల అమలుపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్‌టీఏను ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతపై తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించాలని సూచించింది.

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పందనలను కూడా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై పూర్తి వివరాలు తెలియజేయాలని పేర్కొంది.