ఎగరాలి జెండా 23వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం
మాజీ కౌన్సిలర్ 23 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాజీద్
మంచిర్యాల ఫిబ్రవరి 4( ఆంధ్రప్రభ) ఎగరాలి జెండా 23 వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకమని బుధవారం మంచిర్యాల పట్టణంలోని 23 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మాజీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడపగడపకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చేరే విధంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో యువత ముందుకు సాగుతున్నారని సేవే మార్గం అంటూ ప్రజాసేవకే నా జీవితం అంకితం చేస్తున్నానని అన్నారు. గత ఎన్నికలలో మీరు నాపై మమకారంతో వేసిన ఓటు ఈ ప్రాంత అభివృద్ధికి మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ కృషి చేశానని అన్నారు. నూతనంగా ఏర్పాటు అయినటువంటి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 మంది కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 23 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గుండుజు రాజయ్య,యువజన అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి,నాయకులు బోడంకి మహేష్,చిలుక నాగరాజ్,డిటి సాయి తేజ,చిలుక సాయి తదితరులు పాల్గొన్నారు.
