Kufti got | త్రుటిలో తప్పిన ప్రమాదం

Kufti got | నేరడిగొండ, ఆంధ్రప్రభ : రోజురోజుకు ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels) బస్సులకు ప్రమాదాలు తప్పడం లేదు. గత రెండు రోజుల క్రితమే మండలంలోని కుఫ్టీ గాట్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఇసుక లారీని ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. అది మరవకముందే మండలంలోని దూది గండి(dudhi gandi) జాతీయ రహదారిపై అర్ధరాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి నాగపూర్ వెళ్తున్న ఐచర్ వ్యాన్, అదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రవేట్ ట్రావెల్ బస్సు ఎదురెదురుగా(Opposite) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం స్వల్పంగా(slightly) దెబ్బతిని అద్దం పగిలిపోయింది.

Leave a Reply