ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం

మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల విజ్ఞప్తి

సదాశివనగర్, ఆంధ్రప్రభ: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభం పూర్తిగా వంగి ప్రమాదకరంగా మారింది. పద్మాజివాడి చౌరస్తా నుంచి మోడేగాం గ్రామానికి వెళ్లే చెరువు గట్టు మార్గంలో ఉన్న ఈ స్తంభం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ స్తంభాన్ని వెంటనే సరిచేయాలని గ్రామ సర్పంచ్ గౌడెల్లి గంగాధర్ పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రమాదం జరగకముందే స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.