Gold Rate Today-1.68L | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం రూ.1.68 లక్షలు దాటింది

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం రూ.1.68 లక్షలు దాటింద
హైదరాబాద్ తోపాటు ప‌లు నగరాల్లో తాజా ధరలు
మళ్లీ పరుగులు తీసిన పసిడి
కొనుగోలుదారులకు షాక్

Gold Rate Today-1.68L | ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్ర‌తినిధి : బంగారం కొనాలని భావిస్తున్న వారికి మరోసారి షాక్ తగిలింది. జూలై 10 (శుక్రవారం) దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.14,482కు చేరగా, 22 క్యారెట్ల గ్రాము బంగారం రూ.13,275 వద్ద ట్రేడవుతోంది. నిన్న‌టి ధ‌ర‌తో పోలిస్తే 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.380, 22 క్యారెట్ల ప‌ది గ్రాములుపై ప‌సిడి ధ‌ర‌పై రూ.350 పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం
తులం (11.6638 గ్రా) బంగారం ధ‌ర సుమారు రూ.1,68,900, 22 క్యారెట్ల బంగారం తులం (11.6638 గ్రా) బంగారం సుమారు రూ.1,54,830కు చేరుకుంది. ప్ర‌స్తుతం కొనుగోలు మాత్రం గ్రాముల్లో ప‌సిడి తీసుకుంటున్నారు.

హైద‌రాబాద్‌తోపాటు ప‌లు న‌గ‌రాల్లో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌లు ఇలా…

గమనిక: బంగారం ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రోజులో పలుమార్లు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు ఒక‌సారి ధ‌ర‌లు స‌రి చూసుకోవ‌లెను.