బిజెపి ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులుగా రాథోడ్ సందీప్ కుమార్

జైనూర్, ఆంధ్రప్రభ : బిజెపి పార్టీ ఎస్టీ మోర్చా ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులుగా జైనూర్ మండలం లోని శివనూర్ గ్రామానికి చెందిన రాథోడ్ సందీప్ కుమార్ ను నియమిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ నియామక పత్రం అందించారని రాథోడ్ సందీప్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీలో నేను చేసిన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో బిజెపి ఎస్టీ మోర్చా ఆసిఫాబాద్ జిల్లాఅధ్యక్షుడిగానియమించినందుకుబిజెపిరాష్ట్రనాయకత్వానికి,బిజెపి ఆసిఫాబాద్ జిల్లానాయకత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సందీప్ కుమార్ పేర్కొన్నారు.