WATER | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..

WATER | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..
- కల్వచర్ల సర్పంచ్ అభ్యర్థి ఒర్రె స్వరూప సదయ్య
WATER | రామగిరి, ఆంధ్రప్రభ : అవకాశమిస్తే.. అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridar Babu) బలపరచిన కల్వచర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఒర్రె స్వరూప సదయ్య కోరుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కల్వచర్ల గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనను లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహాకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపడమే నా ధ్యేయమని, తాగునీటి (Water) సమస్యలు పరిష్కారం, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, కాలువల శుద్ధి, పేద కుటుంబాలకు సహాయం వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటానని తెలిపారు. అలాగే గ్రామ యువత అభివృద్ధి, మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. సర్పంచ్ గా తనను ఆశీర్వదించాలని ఒర్రె స్వరూప సదయ్య ప్రజలను కోరారు.
