Revanth Reddy | బాసరలో ఆలయంలో సీఎం పూజలు..

Revanth Reddy | బాసరలో ఆలయంలో సీఎం పూజలు..
బాసరలో సీఎంకు ఘన స్వాగతం
Revanth Reddy | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నిర్మల్ జిల్లా బాసరకు సీఎం రేవంత్రెడ్డి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం మనుమడికి వేద పండితుల మధ్య అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం రూ.225 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు

