11 రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

  • రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అనుసంధానం బలోపేతం కావడంతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట, వంగపల్లి లో హ్యామ్ ఫేజ్-1, ప్యాకేజ్-2 కింద రూ.358.18 కోట్ల వ్యయంతో 210.10 కి.మీ. పొడవున 11 రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు బీర్ల ఐలయ్య , వేముల వీరేశం గారు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి , ఆర్&బీ చీఫ్ ఇంజనీర్ బి.వి. రావు , ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.