నూతన దంపతులకు సుజనా పెళ్లి కానుక ..
ఆంధ్రప్రభ, భవానిపురం ; సాధారణంగా రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలు వివాహానికి ఆహ్వానిస్తుంటారు. వీలును బట్టి ఆ ప్రజాప్రతినిధులు దంపతులను ఆశీర్వదిస్తుంటారు. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒక నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తమ నియోజకవర్గంలోని వారు వివాహానికి సంబందించిన ఆహ్వాన పత్రికలు పంపితే వారికి బహుమానం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. వధూవరులకు సుజనా పెళ్లికానుక పేరిట వధువుకు చీర, వరుడుకి ప్యాంట్, షర్ట్ తో కలిపి న ఒక ప్యాకింగ్ ను అందచేస్తున్నారు.
ఎమ్మెల్యే కాని, ఆయన తరపున కార్యాలయ సిబ్బంది లేదా సుజనా మిత్రలు ఈ పెళ్లికానుకను అందిస్తున్నారు. నియోజకవర్గంలో రెండు పెళ్లిళ్లకు సంబంధించిన శుభకార్యాలు జరిగితే ఆ వధూవరులకు సుజనా పెళ్లి కానుకలు అందచేశారు. 45 వ డివిజన్ లోని సితార సెంటర్ బీటీఎస్ కళ్యాణ మంటపంలో బాలాజీ, దూండేశ్వరి ల వివాహ రిసెప్షన్ కు సుజనా మిత్ర లు వెళ్ళి ఎమ్మెల్యే సుజనా చౌదరి తరపున పెళ్లి కానుక అంద చేశారు.. అదే విధంగా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులోని సీ ఎస్ ఐ చర్చి లో జరిగిన వివాహంలో సంతోష్. కుమార్ , చైతన్య దంపతులకు పెళ్లి కానుక అంద చేశారు.. ఈ సందర్భంగా సుజనా చౌదరి ఔదార్యాన్ని స్థానికులు కొనియాడారు..
