Srikakulam | సైనికుల సేవలకు జేజేలు..

Srikakulam | సైనికుల సేవలకు జేజేలు..

  • ఎమ్మెల్యే గొండు శంకర్

Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : నియోజకవర్గ మండలం రామచంద్రపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామం నుంచి ఎందరో సైనికులు దేశ సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ జొన్నలపాడు గ్రామం నుంచి విశేష సేవలు అందించిన నాటి తరం, నేటితరం ప్రస్తుతం సేవలో ఉన్నవారు సంయుక్తంగా చేసిన, చేస్తున్నసేవలకు గుర్తుగా జొన్నలపాడు గ్రామంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచే విధంగా వాల్ వ్యాల్యూర్ అండ్ సర్వీస్ పేరున దేశ సైనికులకు అంకితమిస్తూ జై జవాన్ పేరున ఓ ముఖద్వారంను, సైనికులు చేసిన త్యాగాలకు చిహ్నంగా, చేసిన సేవలకు ప్రతిరూపంగా సర్వీస్ వాల్ నిర్మించారు. వారి సంకల్పానికి, సేవ స్ఫూర్తికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ జై జవాన్ ముఖద్వారం, సైనికుల స్థూపంను ఈ రోజు ప్రారంభించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచే జొన్నలపాడు సైనికులను అభినందించారు.

గ్రామంలో విలువలతో కూడిన సైనికులు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, దేశ రక్షణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులకు చిహ్నంగా జొన్నలపాడు స్తూపం నిలుస్తుందని, జొన్నలపాడు సైనికులు స్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలను పైలట్లుగా తీర్చిదిదేందుకు ఉమెన్స్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారని, గ్రామంలో గ్రంథాలయానికి అవసరమైన సహకారం అందిస్తామని, మరుగుదొడ్లు నిర్వహణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సైనికులు మాట్లాడుతూ సైనికపురి పేరున సైనికులందరికీ ప్రత్యేకంగా ఓ కాలనీ నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరారు. జిల్లా సైనిక సంఘం ప్రతినిధులు, జొన్నలపాడు గ్రామ సైనికులు, గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.