ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని టౌన్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.మంథని మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన జంజర్ల సునంద అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సహాయం కోసం మంత్రి శ్రీధర్ బాబును సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2 లక్షల 50 వేల విలువైన ఎల్వోసీ చెక్కును మంజూరు చేయించారు.

మంత్రి శ్రీధర్ బాబు సహాయకులు హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అండగా నిలిచి సహాయం అందించిన మంత్రి శ్రీధర్ బాబుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.