క్రీడా పోటీలు శుభ పరిణామం
జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్, జూన్ 25 (ఆంధ్రప్రభ): మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్వహించిన క్రికెట్ పోటీలను జిల్లా ఎస్పీ స్నేహ మెహర తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ ను కట్టడి చేయడం కోసం పోలీసులకు ప్రజలు మేధావులు పాత్రికేయులు సహకరించాలని ఆయన సూచించారు.
ప్రధానంగా యువత డ్రగ్స్ పారినపడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డక్స్ రైతు జిల్లాగా వికారాబాద్ ను రూపొందించడం కోసం అన్ని విభాగాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా ఎస్పీ స్నేహమేహరా మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రగ్స్ తదిత ర్యాలీ నిర్వహిస్తున్నాడు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ అడ్వకేట్ పొలిటికల్ సంబంధించిన జట్ల మధ్య క్రీడలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్ బస్వరాజ్, డి.ఎస్.పి అంజయ్య, డిటిసి డిఎస్పి జానయ్య, సీఐ రఘు కుమార్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
