రోడ్డు ప్ర‌మాదంపై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ దిగ్భ్రాంతి

రోడ్డు ప్ర‌మాదంపై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ దిగ్భ్రాంతి

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంఘటనపై అధికారులతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్ కుమార్ కు తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన టిప్పర్ డీకొట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు.

Leave a Reply