ELECTION | ఆశావాహుల ఆశలకు అవకాశం దక్కేనా?

ELECTION | ఆశావాహుల ఆశలకు అవకాశం దక్కేనా?
*సర్పంచి టికెట్ల కోసం ఇక్కట్లు పడుతున్న పెద్ద మనుషులు.
*మంతనాల కోసం వైట్ కాలర్ ల చుట్టు ప్రదక్షిణలు.
*ఆశావాహుల అవకాశాలకు ఇదే అదును.
ELECTION | గోవిందరావుపేట, ఆంధ్రప్రభ: ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయని రెండు సంవత్సరాల నుండి గడుపుకుంటూ వస్తున్న గ్రామపంచాయతీ ఎలక్షన్లకు ముహూర్తం కుదిరింది. పట్టణం,పల్లె అని తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో ఎన్నికల వేడి,గ్రామాలలోని ప్రజలలో ఉత్సాహం,అధికారులలో ఆర్భాటం మొదలైంది. గోవిందరావుపేట (Govindaraopet) మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా,గ్రామపంచాయతీ సర్పంచుల కాలం ముగిసి రెండు సంవత్సరాలు అయినప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు లేక,అభివృద్ధి కాక,గ్రామపంచాయతీలు కుంటు పడిపోయినాయి.
ఎట్టకేలకు మండలంలో ఎలక్షన్లు హడావుడి మొదలైనప్పటినుండి మండలంలో చిన్న,పెద్ద ఆశావాహులు సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేయడానికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావాహులు టికెట్లను ఆశిస్తూ వైట్ కాలర్ల చుట్టూ తిరుగుతూ,మంతనాలు జరుపుతూ,వారికి సకల మర్యాదలు చేస్తూ,వారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు అని గ్రామాలలో గుసగుసలు వినబడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్,బిజెపి పార్టీలు ఉన్నప్పటికీ రూలింగ్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ(Congress party) అయినందువలన మండలంలో ఉన్న18 గ్రామ పంచాయతీలలో ఒక్కో గ్రామపంచాయతీ నుండి ప్రతి గ్రామంలో రూలింగ్ పార్టీ లోనే టికెట్ల దక్కించుకోవడం కోసం ఒక గ్రామం నుండి ముగ్గురేసి టికెట్ల కోసం మంతనాలు చేస్తున్నారని వినికిడి.
ఇదే అదునుగా చూసుకొని కొంతమంది తెల్ల కాలర్ బాబులు హైకమాండ్ (High Command) తో మాట్లాడి టికెట్లు ఇప్పిస్తామని ఆశావాహులకు ఆశలు చూపిస్తూ, వారి అవసరాలను తీర్చుకుంటూ ఇప్పటికే పట్టణాలలో బైఠాయించినారని మండలంలో అనుకుంటున్నారు.ఏది ఏమైనా ఈసారి గోవిందపేట మండలంలోనీ గ్రామాల ప్రజలు సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకునే ముందు అభివృద్ధి చేసి వారిని,గుణ,గణాలను చూసి సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకోవాలని,ఓటుకు,నోటు అనే పదానికి లొంగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని గోవిందా పేట మండల లోని గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు.
