సమాజాన్ని జయించే శక్తి చదువు ఒక్కటే
సమాజాన్ని జయించే శక్తి చదువు ఒక్కటే
చిట్యాల, ఆంధ్రప్రభ: సమాజాన్ని దేశాన్ని మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉందని గణిత అధ్యాపకులు దాసరి శ్రీరాములు అన్నారు. తాను బాల్యంలో చదివిన చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన “దాసరి సత్తమ్మ సాయిలు విద్యా, సాహిత్య సహకార సంస్థ” తరఫున విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు.
పాఠశాలలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన పేదరికాన్ని జయించడానికి ఈ ప్రభుత్వ బడిలో నేర్చుకున్న చదువే కారణమన్నారు. ప్రధానోపాధ్యాయురాలు సుశీల మాట్లాడుతూ ఇదే బడిలో చదివిన శ్రీరాములు నేడు విద్యార్థులను ప్రోత్సహించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, కోణం శ్రీనివాస్, ఎ. పద్మజ, ఎ. కవిత, ఎన్. సైదులు, ప్రసన్న,, శైలజ, జె. మంజుల, ఎండి. సాదిక్, ఎం. జానకి, ఎం. సౌమ్య తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
