ఏటూరులో వాహనాల తనిఖీలు
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని ఏటూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, టీజీఎస్పీ బలగాలతో కలిసి ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న 21 ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.5,790 వసూలు చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై రూ.1,600 జరిమానా విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని పోలీసులు సూచించారు.
