Father-Kills-Son : త‌ల్లిని తిట్టాడ‌ని.. కోపంతో.. Andhra Prabha Crime News

Father-Kills-Son : త‌ల్లిని తిట్టాడ‌ని.. కోపంతో.. Andhra Prabha Crime News

  • కొడుకును చంపేశాడు
  • ఓ తండ్రి క్ష‌ణికావేశం
  • కృష్ణాజిల్లాలో సంచ‌ల‌నం

మచిలీపట్నం – ఆంధ్రప్రభ

Father-Kills-Son : కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బొట్లవానిపాలెంలో క్షణికావేశం ఒక కుటుంబంలో విషాదం నింపింది. కోపంతో కర్రతో దాడి తండ్రి చేయ‌గా.. కొడుకు ప్రాణాలు పోయాయి. పోలీసుల వివరాల ప్రకారం… బొట్లవానిపాలేం గ్రామానికి చెందిన రామ్మోహన్ రావు ఇంట్లో ఆయన కుమారుడు కళ్యాణ చక్రవర్తి (30)తో తల్లికి మధ్య గొడవ జరిగింది. దీన్ని సర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ త‌న‌యుడు తండ్రిని బేఖాత‌రు చేయ‌గంతో. మాకు పుట్టినోడివి మ‌మ్మ‌ల్నే లెక్క‌చేయ‌వాని రామ్మోహన్ రావు క్షణికావేశానికి గురయ్యారు. ఆవేశంలో కుమారుడు కళ్యాణ చక్రవర్తిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో కళ్యాణ చక్రవర్తికి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి రామ్మోహన్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో బొట్లవానిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.