రామగుండం, ఆంధ్రప్రభ – ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించి కాంస్య పతకం సాధించిన ఏసీపీ సాదుల సారంగ పాణి కుమార్తె మేఘన ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలవగా మేఘన ను ఘనంగా సత్కరించారు.
ఏసీపీ సారంగపాణి కుమార్తె సాదుల మేఘన గత కొన్ని సంవత్సరాలుగా పిస్టల్ షూటింగ్‌లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచ కప్ 2023 లో జట్టు బంగారు పతకం, దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్ 2023 లో వెండి పతకం, దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 3 జాతీయ ఛాంపియన్‌షిప్ పతకాలు మరియు బహుళ తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పతకాలు,జూనియర్ వ్యక్తిగత కాంస్య, జూనియర్ సివిలియన్ కాంస్య, సీనియర్ జట్టు వెండి, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంస్య పతకం సాధించడం జరిగింది
. విలువిద్యలో జాతీయ స్థాయి పోటీల్లో తన సత్తా చాట్టడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తమ పిల్లలను క్రీడల్లో వున్న ఆసక్తి గమనించి వారిని ప్రోత్సహించాలని, ముఖ్యంగా నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు సైతం తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిమచడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందించడం సంతోషదాయకమన్నారు.