MI vs DC | సూర్య కుమార్ – న‌మ‌న్ ధీర్ విజృంభణ.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే !

ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ రేస్‌లో నిలవాలంటే గెలుపు తప్పనిసరిగా ఉన్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తమ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు…. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ప్రధానంగా సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 73 పరుగులు చేయడం విశేషం. తన ఇన్నింగ్స్‌లో 4 సిక్సులు, 7 ఫోర్లతో ఆకట్టుకున్నాడు.

సూర్య‌కుమార్ కి తోడు ఆఖ‌ర్లో.. నమన్ ధీర్ కూడా మెరుపు ప్రదర్శన కనబరిచాడు. నమన్ ధీర్ కేవలం 8 బంతుల్లో 24 పరుగులు చేసి ముంబై స్కోరు పెరగడంలో కీలక పాత్ర వహించాడు. ఈ ఇద్దరూ కలిసి 6వ వికెట్‌కు 21 బంతుల్లో 57 పరుగులు జోడించి నాటౌట్‌గా ఇన్నింగ్స్ ముగించారు.

ఇక‌ టాప్ ఆర్డర్‌లో ర్యాన్ రికెల్టన్ (25), విల్ జాక్స్ (21) ప‌రుగులు చేయ‌గా.. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ (27) పరుగులు చేసి ఔట‌య్యాడు. కానీ, ఓపెనర్ రోహిత్ శర్మ (5), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (3) నిరాశ ప‌రిచారు.

ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ 2 వికెట్లు తీశాడు. చమీర, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీసి ముంబై ఆగడాన్ని కొంతవరకూ కట్టడి చేశారు.

ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 181 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ బెర్త్ పై భారీ ప్రభావం చూపనుంది.

Leave a Reply