ఔరా.. ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి కరెంటు బాగు చేసిన సర్పంచ్!
ఔరా.. ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి కరెంటు బాగు చేసిన సర్పంచ్!
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: గాలిదుమారం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పలుమార్లు సమాచారం అందించినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులోకి రాకపోవడంతో శాపల్లి గ్రామ సర్పంచ్ రాజు స్వయంగా రంగంలోకి దిగారు.
గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన సర్పంచ్ రాజు కరెంటు స్తంభం ఎక్కి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లోపాలను సరిచేసేందుకు ప్రయత్నించారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య కూడా వెంటనే పరిష్కారమైంది.
సర్పంచ్ తీసుకున్న చొరవ ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన అంకితభావాన్ని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. అయితే విద్యుత్ పరికరాల మరమ్మతులు నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలని, ఇలాంటి పనులు ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
