Shambala | సక్సెస్ సెలబ్రేషన్స్..

Shambala | సక్సెస్ సెలబ్రేషన్స్..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ(Latest Movie) శంబాల. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే.. ఈ మూవీ ప్రీమియర్లకు(To the premiers) మంచి స్పందన రావడం, మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో చిత్రం దూసుకుపోతోండటంతో చిత్రయూనిట్ సక్సెస్ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సక్సెస్ కు దూరంగా.. ఫ్లాపులకు దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు తనయుడు ఆదికి సక్సెస్ రావడంతో.. సాయికుమార్(Saikumar) గాల్లో తేలుతున్నట్టుగా సంతోషంగా ఉన్నారు.

Shambala | శంభాల సక్సెస్ కారణం ఆయనే..

Shambala

ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ .. మా నాన్న గారు విజయనగరంలో ‘ప్రేమ కావాలి’ మూవీని చూసి నాకు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. ఈ రోజు ప్రతీ చోటా హౌస్ ఫుల్స్(House fulls) పడ్డాయి. ఈ మాటలు వింటే నాకు మళ్లీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. నా ఈ 50 ఏళ్లలో 300కి పైగా చిత్రాలు, వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్(Dubbing for movies) చెప్పాను. నేను ప్రతీ వారం వచ్చే చిత్రాల గురించి, వాటి ఫలితాల గురించి తెలుసుకుంటూనే ఉంటాను. ‘పోలీస్ స్టోరీ’కి హౌస్ ఫుల్ అవుతుందా? అనుకున్నాను. కానీ హాలు నిండినది అని బోర్డ్ చూసి నాకెంతో సంతోషం కలిగింది. మళ్లీ ఇప్పుడు ఆ మాటలు వింటున్నాను. శంబాల టీ షర్ట్(Shambhala T-shirt) వేసుకుని నేను నిన్న థియేటర్ విజిట్‌కు వెళ్లాను. అలా వెళ్లిన ప్రతీ చోటా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి చెప్పినట్టుగా ఈ శుక్రవారం మేం హిట్టు కొట్టాం. అర్దరాత్రి నాకు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అని మెసెజ్ పెట్టారు. ప్రతీ చోటా నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది టికెట్ల కోసం ఫోన్ చేస్తున్నారు. దీనంతటికి కారణం డైరెక్టర్ యుగంధర్ ముని(Director Yugandhar Muni) అని చెప్పారు..

Shambala | పుత్రోత్సాహం..

Shambala

ఆది కూడా నాలానే డైరెక్టర్ యాక్టర్. నా వాయిస్ ఓవర్(Voice over) కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ ఈ మూవీని యుగంధర్ అద్భుతంగా తీశారు. మంచి టీంతో మహీధర్ గారు, రాజశేఖర్ గారు తీసిన ఈ మూవీని ఆడియెన్స్ పెద్ద హిట్ చేశారు. ‘శంబాల’ వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని(The audience) ఆకట్టుకుంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలే విజయాన్ని సాధిస్తాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్దాయి.. అన్ని చోట్ల నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. మన ఆది హిట్ కొట్టాడని అందరూ ఫోన్‌లు చేస్తున్నారు.. పుత్రోత్సాహం అంటూ ఆడియెన్స్ నాకు చెబుతున్నారు. ‌ఇది ప్రజల విజయం. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది(What a movie to watch). అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి ఈ మూవీని గొప్పగా రూపొందించారు. త్వరలోనే ‘శంబాల’ టీం సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది’ అని అన్నారు.

Shambala | అన్ని చోట్లా హౌస్ ఫుల్స్..

Shambala

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. నా ఈ సినీ ప్రయాణంలో అండగా నిలిచిన అందరికీ థాంక్స్(thanks). మూవీని చూసిన వారంతా మెసెజ్‌లు చేస్తున్నారు. ‘శంబాల’ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. ప్రీమియర్ల నుంచి డే వన్‌కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతూనే వచ్చాయి. చాలా కాంపీటిషన్‌(Competition)లో విడుదలైనా కూడా ఆ మూవీ పెద్ద హిట్ అయింది. త్వరలోనే థియేటర్లు పెంచబోతోన్నాం. ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. అప్పుడే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగల్గుతారు. హాలీడే సీజన్‌ను అందరూ ‘శంబాల’తో ఎంజాయ్(enjoy) చేయండి అని అన్నారు.

click here for more news

click here to read వివాదం.. ముగిసిందా… ముదిరిందా.. ?

Leave a Reply