గద్దర్ అవార్డు గ్రహీత ధనుంజయకు సన్మానం

చౌటుప్పల్, ఆంధ్రపభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త చిరందాసు ధనుంజయ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర డాక్యుమెంటరీ చిత్రం కు గద్దర్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కమిటీ ప్రతినిధులు అవార్డు అందుకున్న చిరందాసు ధనుంజయ దంపతులను సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుంజయ నిర్మాతగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర డాక్యుమెంటరీ చిత్రంను నిర్మించి ఈ తరం వారికి కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి తెలియజేయడం ఎంతో సంతోషం కలిగించిందని, దీనిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, గుర్రం వెంకటేశం, తూర్పాటి నరసింహ, వరకాల రవి గౌడ్ పాల్గొన్నారు.