పర్యావరణ శిక్షణకు వెళ్లిన ఆలేరు హైస్కూల్ విద్యార్థులు..

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని పిఎంశ్రీ .బాలుర ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు యంగ్ ఎర్త్ లీడర్ శిక్షణలో భాగంగా రంగారెడ్డి జిల్లా కర్తల్ గ్రామంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి బయలు దేరి వెళ్ళారు.అక్కడ ఈ విద్యార్థులు పర్యావరణ పరమైన అంశాలపై రెండు రోజుల పాటు శిక్షణ పొంది వచ్చి ఇక్కడి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.వాతావరణంలో వస్తున్న మార్పులు ఏ కారణాల వలన వస్తున్నాయి వాటిని నివారిస్తూ ప్రకృతికి ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై శిక్షణ పొందుతారు. విద్యార్థులకు ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల ,ఉపాధ్యాయ బృందం వీడ్కోలు పలికారు.విద్యార్థుల వెంట పాఠశాల పీడీ, క్యాంపు మోటివేటర్ పూల నాగయ్య కూడా బయలుదేరి వెళ్ళారు.