ఫర్టిలైజర్ దుకాణాల్లో సీడ్ టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో శుక్రవారం
సీడ్ టాస్క్ ఫోర్స్ టీం వ్యవసాయ అధికారి పాండురంగ చారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని పలు డీలర్ల వద్ద పత్తి , వరి విత్తనాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ ను తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందజేయాలని సూచించారు. రైతులు లైసెన్స్ ఉన్న విత్తన డీలర్లు వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు సంబంధించి రసీదు తప్పనిసరిగా తీసుకొని వంటకాలం పూర్తయినంతవరకు భద్రపరచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన వెంట ఏ ఓ వి కీర్తి ఉన్నారు.