Scrub Typhus | 12 పాజిటీవ్ కేసులు..

Scrub Typhus | 12 పాజిటీవ్ కేసులు..
Scrub Typhus, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. అనుమానిత, ధృవీకృత కేసుల పై ప్రత్యేకంగా ఇంటింటి సర్వేల ద్వారా పర్యవేక్షిస్తునట్లు తెలిపారు.
