Bikkanur | అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి..

Bikkanur | అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి..

Bikkanur, ఆంధ్ర ప్రభ : బిక్కనూరు మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి షబానా బేగం కోరారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యంతో సర్పంచిగా పోటీ చేస్తున్నానని.. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు తమను సర్పంచిగా గెలిపించాలని ఆమె కోరారు. పట్టణంలో తాగునీటి సమస్యతో పాటు మురికి కాలువల నిర్మాణం, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పారు. యువత కోసం జిమ్ తో పాటు ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 24 గంటలు ప్రజాసేవకు అందుబాటులో ఉంటానని తెలిపారు.