Scholarship | విజయ్ దేవరకొండ, ర‌ష్మిక దంప‌తుల‌ చేయూత

Scholarship | విజయ్ దేవరకొండ, ర‌ష్మిక దంప‌తుల‌ చేయూత

Scholarship | అచ్చంపేట విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ ఫౌండేషన్
చిన్ననాటి కలను నిజం చేస్తూ తుమ్మన్‌పేటకు విజయ్, రష్మిక పయనం

Scholarship | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తన తండ్రి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామ అభివృద్ధి, అక్కడి విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఫిబ్రవరిలో తన చిన్ననాటి కలను నెరవేర్చబోతున్నట్లు ప్రకటించిన విజయ్ దేవరకొండ.. తాజాగా ఆ దిశగా కీలక అడుగు వేశారు. తనతో పాటు ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు.

ది దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతులు చదువుతున్న ప్రతిభావంతులైన 180 మంది విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఫౌండేషన్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఎంపికైన 180 మంది విద్యార్థుల పూర్తి జాబితాను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకున్నారు. కష్టపడి చదివి తమ కుటుంబాలకు, పాఠశాలలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను అభినందిస్తూ వారి ఉన్నత విద్యకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

తనకు సొంతూరితో ప్రత్యేక అనుబంధం ఉందని, గ్రామానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందని విజయ్ దేవరకొండ భావోద్వేగంగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భవిష్యత్తులో కూడా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటూ వస్తున్న దేవరకొండ ఫౌండేషన్.. మరోసారి విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

CLICK HERE TO READ Extra20minutes | ఓటీటీలో మరింత పెద్దగా ‘పెద్ది’.. !

CLICK HERE TO READ MORE