భీమ్‌గల్ కోర్టు భవనం పరిశీలన..
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌లో ఇటీవల నిర్మాణం పూర్తయిన నూతన కోర్టు భవనాన్ని సోమవారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సందర్శించి పరిశీలించారు. త్వరలో ప్రారంభం కానున్న కోర్టు కార్యకలాపాల దృష్ట్యా భవనంలోని మౌలిక సదుపాయాలు, కోర్టు హాళ్లు, న్యాయవాదుల గదులు, ఇతర ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్, సీనియర్ న్యాయవాది భూపతి రెడ్డి, న్యాయవాదులు ఏలేటి గంగాధర్, చైతన్య, సురేష్ తదితరులు భవనాన్ని సందర్శించారు.
కోర్టు ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించినట్లు సమాచారం. భీమ్‌గల్‌లో నూతన కోర్టు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని, న్యాయ సేవలు మరింత వేగవంతంగా అందుబాటులోకి వస్తాయని వారు అభిప్రాయపడ్డారు. కోర్టు ప్రారంభోత్సవాన్ని త్వరలోనే నిర్వహించాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ పరిశీలన లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి, బోదిరే స్వామి, టౌన్ ప్రెసిడెంట్ అనంత్ రావు, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కౌన్సిలర్లు అంజుమ్, సతీష్, సందీప్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆరిగేల జనార్దన్, సేపూర్ చరణ్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు ఆరే రవీందర్, యోగేశ్వర్ నర్సయ్య, బుర్ర దేవేందర్ గౌడ్, పల్లె శేఖర్,
తదితరులు ఉన్నారు.
