ఇసుక దందా..

ఇసుక దందా..
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : గ్రామ కార్యదర్శుల కనుసైగలలో అధికార పార్టీ లీడర్లు మండల తాసిల్దార్ ఆఫీసులలో దరఖాస్తు చేసుకొని ఎటువంటి పర్మిషన్ రాకున్నా. గత నెల రోజుల నుండి ఇసుక దందా లక్షల రూపాయల్లో నడుస్తున్నారు. అయితే.. మండల తాసిల్దార్ గ్రామ కార్యదర్శులు, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఉప్పరపల్లి క్రాస్ నుండి వర్ధన్నపేట ఆకేరు వాగు వరకు, ఖమ్మం వరంగల్ హైవేకు బోర్డు పేట్టి, రోడ్డు పక్కన ఇరువైపులా ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. గోదావరి ఇసుక అమ్మటానికి, వే బిల్లుతో పాటు బిల్ బుక్, రిజిస్టర్ తో పాటు ఎంత అమ్మడం జరిగింది. ఇంకా ఎంత స్టాక్ ఉంది. ఎప్పటికప్పుడు బిల్ బుక్ లో స్టాక్ రిజిస్టర్లలో పొందుపరచవలసి ఉంటుంది. నిబంధనలను తుంగలో తొక్కి, గ్రామ పంచాయతీలకు టాక్సీ రావలసిన నిధులను దుర్వినియోగం చేస్తూ, చట్ట వ్యతిరేక చర్యలకు చేపడుతున్నారని పలు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు..
అధికార పార్టీ నేతలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇష్ట రీతిగా ఇసుక అమ్ముతున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కాని వారు, ఇసుక డంపు కోసం దరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ వచ్చేదాకా మీరు ఇసుక నడపవద్దని అధికారులు భయపెడుతున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిషన్ లేకుండా నడుపుతున్న ఇసుక డంపుల పై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
