Devotional songs | సనాతన ధర్మం మానవాళికి ఆదర్శం..
ఊట్కూర్ లో ఘనంగా అయ్యప్ప పడి పూజ.
Devotional songs | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సనాతన ధర్మం అంటే పరమత సహనాన్ని పాటించి మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని గురు స్వాములు భగవంతు, రఘువీర్, శంకర్, నరసింహులు అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని బీర లింగేశ్వర వీధిలోని కటికేరి అశోక్ కత్తి స్వామి నివాసంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ(Ayyappa Padipuja) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు, ప్రత్యేక పూజలు చేపట్టారు.
గురుస్వాములు మాట్లాడుతూ… అయ్యప్ప మాలధారణ చేసుకున్న భక్తులు ఎంతో నిష్టతో కఠినమైన దీక్షను చేపట్టి శబరిమల యాత్ర చేస్తారన్నారు. అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులే కాకుండా శరణము అని కొలిచిన వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. అనంతరం ఈ సంవత్సరం శబరిమలకు 18వ సారి మాలధారణ(18th Maladharana) చేసుకొని వెళుతున్న భానుచందర్ గురుస్వామి, పోర్ల బోయ కతలప్ప గురు స్వాములకు ఘనంగా సన్మానం చేశారు.
అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాడిన భక్తి గీతాలు(Devotional songs) స్వాములను, భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో గురు స్వాములు ముద్దం రాము, వెంకట్ రాములు, ముద్దం సునీల్, సందీప్, ప్రేమ్ సుధాకర్, తమ్మారెడ్డి, శ్రీకాంత్, అంబదాస్, తదితరులు పాల్గొన్నారు.

