Future centers | దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు

Future centers | దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు

Future centers | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : సమాజంలో వేసే ప్రతి అడుగుకూ అంగవైకల్యం అడ్డుకారాదనీ.. మనోైస్థెర్యంతో ముందుకెళ్లాలనే యోచనతో దివ్యాంగులకు భవిత కేంద్రాలు(Future centers) శిక్షణనందిస్తున్నాయని మండల విద్య వనరుల అధికారి ఎన్.ఆంద్రయ్య పేర్కొన్నారు. డిసెంబర్ 3న‌ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిత కేంద్రం, ప్రాథమిక పాఠశాల కమ్మర్ పల్లిలో కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివ్యాంగుల పట్ల చిన్నచూపు తగదని, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు వినికిడి యంత్రాలను(hearing aids) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన త‌హ‌సీల్దార్‌ గుడిమేల ప్రసాద్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ లు మాట్లాడారు. వీరికి సామాజిక, విద్య, ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కోరారు.

సరైన అవకాశాలు ఇస్తే ప్రతి దివ్యాంగుడు మహత్తర లక్ష్యాలను సాధిస్తాడని తెలిపారు. మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన చిన్నారులను పూర్వస్థితికి తెచ్చేలా భవిత కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారని, దివ్యాంగుల తల్లిదండ్రులు భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆది నాగలక్ష్మి(Adi Nagalakshmi), రాజన్న, స్పెషల్ ఎడ్యుకేటర్ మధుశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply