సదాశివపేట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా అనంత కిషన్

సదాశివపేట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా అనంత కిషన్

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సదాశివపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి వ్యవహారాల ఇన్‌చార్జిగా, మున్సిపల్ వ్యవహారాల ఇన్‌చార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్‌ను నియమించారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నియామకం చేపట్టారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, పట్టణ కాంగ్రెస్ కమిటీ నియామక వ్యవహారాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తోపాజీ అనంత కిషన్‌కు సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.

సమన్వయకర్తలుగా కంబలపల్లి రాంరెడ్డి, సీడీసీ చైర్మన్ సిద్దన్న, బ్లాక్ అధ్యక్షుడు, నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు తదితరులతో కలిసి పనిచేయాలని జగ్గారెడ్డి సూచించారు.

Leave a Reply