కోర్టు ఆవరణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
కోర్టు ఆవరణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జూనియర్ సివిల్ జడ్జి సాయి శరత్
పరకాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పరకాల కోర్టు ఆవరణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి శరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది పరస్పరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూకట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్దబోయిన వేణు, ఏజీపీ మెరుగు శ్రీనివాస్, ఏపీపీ కె. రుదిర, న్యాయవాదులు రాజిరెడ్డి, చంద్రమౌళి, రాజమౌళి, స్వామి వెంకటరమణ, పవన్, టి. సురేశ్, సాయికుమార్, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
