ఏప్రిల్ 20న రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండలంలోని రైతులు తమ సమీప రైతు వేదికల్లో సోమవారం (20-04-2026) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొనాలని మండల వ్యవసాయ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు.

ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రైతులకు పలు ముఖ్య అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సాయిల్ హెల్త్ వాలంటీర్ల అవగాహన కార్యక్రమం, అగ్రి స్టాక్ (Agri Stack) కింద రైతుల నమోదు వంటి విషయాలను వివరించనున్నట్లు తెలిపారు.

అదనంగా, ముఖ్యమంత్రి విడుదల చేయనున్న రైతు భరోసా రెండో విడత నిధులపై ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందువల్ల, సమీప రైతు వేదికల్లో పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.