Assembly | ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు

Assembly | ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు
Assembly | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. విజయావకాశాలు అధికార డీఎంకేకు ఉన్నాయని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వెనుకబడిందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎన్డీయేలో కీలక నేతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగుతున్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (సోమవారం) మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరి వెళ్తారు. ఈయన కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో చేయనున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం సాగనుంది. ఈయన బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొనున్నారు.
