కలెక్టర్ భరోసా.. ప్రజల ఆశ
కలెక్టర్ భరోసా.. ప్రజల ఆశ
ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం బారులు తీరిన ప్రజలు
ఫోటో రైట్‌అప్ (జనగామ): జనగామ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాల పరిష్కారం కోసం ఉదయం నుంచే కలెక్టరేట్ వద్ద బాధితులు బారులు తీరారు. ప్రజావాణి ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్టు కనిపిస్తోంది.
