ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ..
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాంటి భాదితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నిజంగా ఒక వరం అని తెదేపా నాయకులు అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ.7.40 లక్షల చెక్కులను విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ సహకారంతో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
నాటి ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఉందని,నేడు కూటమి ప్రభుత్వంలో వేల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతే అని స్పష్టం చేశారు.ఆయా కార్యక్రమాల్లో నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, దిరిశాల వెంకటకృష్ణారావు, దేవభక్తుని సీతారాంప్రసాద్, గువ్వల వెంకటేశ్వరరెడ్డి, కొత్తా రజినీకాంత్, బొల్లా కరుణాకర్, పి.రాంబాబు, కోట వెంకటేశ్వరరావు, బెల్లం మధుసూదన్ రావు, ఇనుగంటి మధుసూదన్, జంగా చెంచురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
