పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి..

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి..

లబ్ధిదారునికి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు…

తిరువూరు, ఆంధ్రప్రభ : ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. గురువారం తిరువూరు మండలం మల్లెల గ్రామంలోని గుంట్రు మురళి కృష్ణ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, అతనికి మంజూరైన రూ. 31,377 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆసుపత్రి చికిత్స కోసం పేదలు చేసే ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లించడం వల్ల అనేక కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.

అవసరమైన సమయంలో వెంటనే స్పందించి, సహాయం అందేలా కృషి చేసిన శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు కి లబ్ధిదారుడు మురళి కృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తున్న ఎమ్మెల్యే తీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply