హనుమాన్ దీవెనలు ప్రజలు పై ఉండాలి..

హనుమాన్ దీవెనలు ప్రజలు పై ఉండాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : శ్రీ హనుమాన్ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో జీవించి, సౌభాగ్యం వెల్లి వెరీ యాలని ప్రభుత్వ విప్ నకిరేకల్ శాసనసభ్యు లు వేముల వీరేశం అన్నారు. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం ఆధ్వర్యంలో అర్చనలు జరిపి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య, ఏఎంసి చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, అంతటి నరసింహ, తదితరు పాల్గొన్నారు

