Rs. 2500 pension | బీజేపీతోనే గ్రామాల్లో అభివృధి సాధ్యం…

Rs. 2500 pension | బీజేపీతోనే గ్రామాల్లో అభివృధి సాధ్యం…

Rs. 2500 pension | వరంగల్, పర్వతగిరి, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామ పంచాయతీల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్రమే నిధులు ఇస్తోందనేది సత్యం. కాబట్టి బీజేపీకి ఓటేస్తేనే గ్రామాలకు మరిన్ని నిధులు, మరింత అభివృద్ధి సాధ్యమని గంట రవికుమార్ అన్నారు.

ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పర్వతగిరి మండల పార్టీ అధ్యక్షుడు చీమల బిక్షపతి(Bhikshapati) ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోనీ పర్వతగిరి మండలం చింతా నెక్కొండ, ఏబీ తండా, బట్టుతండ గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేయించడం జరిగింది.


అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మండిపడ్డారు. మహిళలకు 2500 రూపాయల పింఛన్లు(pension of Rs. 2500), రైతు రుణమాఫీ, ఉచిత యూరియా సరఫరా వంటి కీలక వాగ్దానాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మార్గనిర్దేశనం చేశారు.

పంట సాయం అందించడంలో జాప్యం, రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం, పంటలకు మద్దతు ధర (MSP) చట్టపరమైన హామీని ఇవ్వకపోవడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుండి వ్యతిరేకతకు ప్రజలు స్థానిక ఎన్నికలతో బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని అన్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ పార్టీ తమ “కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy declaration)”లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసి బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం జారీ చేసిన GO 46 ప్రకారం, బీసీలకు కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే కేటాయించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతం గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు కుడికాల శ్రీధర్, పిచ్చిరెడ్డి బత్తిని దేవేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply