Rs.2 lakhs | 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

Rs.2 lakhs | 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం
Rs.2 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గుంటూరులో ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
లాలాపేటలో 11 మందిని, పాత గుంటూరులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
CLICK HERE TO READ MORE : ipl23april | ఐపీఎల్ ఎల్-క్లాసికో: ముంబై vs చెన్నైఉత్కంఠభరిత పోరు
