మంత్రులచే సబ్ స్టేషన్ శంకుస్థాపన

మంత్రులచే సబ్ స్టేషన్ శంకుస్థాపన
వేంసూరు, ఆంధ్రప్రభ : వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలో 33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, విద్యుత్ వినియోగ దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
