46 Families | ఆసిఫాబాద్ జిల్లాలో నేడు రేవంత్ టూర్
46 Families | ఆసిఫాబాద్ జిల్లాలో నేడు రేవంత్ టూర్
రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఇందిరమ్మ రెండో విడత గృహాల పైలాన్ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇందిరమ్మ గృహాల మంజూరు
46 Families | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం గిరిజన జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా అడుగడుగునా భద్రతా చర్యలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కానుకగా రెండో విడత ఇందిరమ్మ గృహాల మంజూరీ ఇక్కడి నుండే సీఎం శ్రీకారం చుడతారు. ఆదివాసి గిరిజనుల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడి అభివృద్ధి పనుల్లో పాలుపంచుకోనున్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ధన సరి సీతక్క సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, పలు అభివృద్ధి పథకాల అంశాలను పరిశీలించారు. జన సమీకరణ బాధ్యత స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు అప్పగించారు.

46 Families | రూ.112.14 కోట్ల వ్యయంతో సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం..!
సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూ. 112.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టానున్నారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగే సభలో సీఎం పాల్గొంటున్న నేపథ్యంలో 13 జిల్లాల నుండి 1000 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.
46 Families | కొత్తగూడకు పండగ శోభ..!
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొటారి గ్రామపంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గూడెం కొత్తగూడ సీఎం పర్యటన నేపథ్యంలో పండుగ శోభ సంతరించుకుంది. కేవలం 46 కుటుంబాలు కలిగి ఉన్నాయి గిరిజన గూడెంలో ఆదివాసి కోలాo గిరిజన నివసిస్తున్నారు. ఇంత కాలం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ పల్లె ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి విడతలు 26 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, వీటిలో 25 పూర్తయ్యాయి. సీఎం చేతుల మీదుగా పండగ వాతావరణం లో సామూహిక గృహాలను ప్రారంభించనున్నారు. ఈ గ్రామానికి సిసి రోడ్లు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ఇందిరమ్మ గృహాలకు అరటి ఆకులు, కొబ్బరి కొమ్మలు, పుష్పాలు అలంకరించడం తో కొత్తగూడా పండగ వాతావరణం సంతరించుకుంది. ఇక్కడి నుండి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా రెండో విడత 2.5 లక్షల ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయనున్నారు.
46 Families | ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగేదిలా..!
సాయంత్రం 4.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి కెరమెరి మండలం కొఠారి గ్రామానికి చేరుకుంటా లరు.
సాయంత్రం 5:45 గంటలకు 26 ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం చేస్తారు… రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడ నుంచే సీఎం ప్రారంభించనున్నారు..
సాయంత్రం 6.30 వరకు ఆదివాసి గిరిజన లబ్ధిదారులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. వారి వినతలు స్వీకరించనున్నారు.
సాయంత్రం 6.55కు కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.
6.55 నుంచి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
7 గంటల నుంచి 8.30 వరకు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా పలువరాలు ప్రకటించే అవకాశం ఉంది.
రాత్రి 8.30కు రోడ్ ద్వారా సీఎం బయల్దేరి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ ఇంటికి వెళ్తారు.
రాత్రి పది గంటలకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో బస చేసి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
CLICK HERE TO READ MORE : Rs.20ThousandperMonth | వేతన జీవుల.. జీవితాల్లో వెలుగులు
