సుక్కుడపల్లిలో పైప్‌లైన్‌కు మరమ్మతులు.. నీటి సరఫరా పునరుద్ధరణ
సుక్కుడపల్లిలో పైప్‌లైన్‌కు మరమ్మతులు.. నీటి సరఫరా పునరుద్ధరణ
జైనూర్, ఆంధ్రప్రభ:
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పార గ్రామ పంచాయతీ పరిధిలోని సుక్కుడపల్లి గ్రామంలో తాగునీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. గత రెండు రోజులుగా వాటర్ సప్లై పైపులకు రంధ్రాలు ఏర్పడటంతో గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న పార గ్రామ సర్పంచ్ మెస్రం జంగుబాయి జ్ఞానేశ్వర్ ఆదివారం స్పందించారు.
గ్రామ ప్రజల సహకారంతో పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. ప్రస్తుతం వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామ ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు.
